Thursday, December 29, 2011

పాటలు పాడే కోయిలమ్మ నీ గాత్రం నాకు ఇవ్వమ్మా ..

పాటలు పాడే  కోయిలమ్మ  నీ  గాత్రం  నాకు  ఇవ్వమ్మా ..



ముద్దు  మాటల  చిలకమ్మా  నీ  ముక్కు  ఎరుపు  నాకు పంచమ్మా ..


రంగు  రెక్కల  నెమలమ్మ  నీ  నడకల  సొగసు  నాకు  నేర్పమ్మా ..


చుక్కాని  చూపుల  గ్రద్దమ్మ  నీ  అలుపులేని  పోకడ  నాకు  కావాలమ్మా ..


పొడుగైన  ముక్కున్న కొంగమ్మా నీ  అంతులేని  స్వేచ్చ  నాకు ఆదర్సమమ్మా ..

Wednesday, December 28, 2011

నీతో గడిపిన ప్రతి క్షణం ...గగనంలో తేలిపోయే ఒక విహారం ..

నీతో  గడిపిన  ప్రతి  క్షణం ...గగనంలో  తేలిపోయే  ఒక  విహారం ..
భాధలో  నేను  మునిగినప్పుడు ...నీ  మాటే   నాకొక  మంత్రం ..


నా  కనుల  ముందు  స్వర్గాన్ని  ఉంచావు  నీ  స్నేహంతో ..
నీ  తలపులే  నా  కోవెల  గా  మార్చావు  నీ  అభిమానంతో..


ఓ నేస్తమా ...నీవే  నా  ప్రాణం ..
ఓ స్నేహమా ..నీవే  నా  సమస్తం ..


వెదికే  నా  వేదనకు  నీ  పరిచయమే  ఒక  వేడుక ..
మండే  నా  గుండెకు  నీ  అనురాగమే  ఒక  ఆలంబన ..

ఏ దేవుని  వరమో  నీ చెలిమి ..
ఏ  దీవెనల  ఫలమో  ఈ  బలిమి ..


పొంగిపోతుంది  నా  హృదయం ..
ధన్యమయింది  నా  జీవితం..

Tuesday, December 27, 2011

తలచినదే జరిగినదా దైవం ఎందులకు ..

తలచినదే జరిగినదా దైవం ఎందులకు ..



జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు..


ముగిసినగాధ మొదలిడదు దేవుని రచనలలో..


మొదలిడుగాధ  ముగిసేదెపుడో  మనుషుల  బ్రతుకులలో ..


మనసునకేన్నో మార్గాలు.. కనులకుఎన్నో స్వప్నాలు..


ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు ..


యెదలో ఒకరే కుదిరిన నాడు మనసే ఒక స్వర్గం..


ఒకరుండగా వేరోకరోచ్చారా లోకం ఒక నరకం..


ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం ఏది నిజమౌ బంధం..


ఏది అనురాగం ఏది ఆనందం బ్రతుకునకేదీ గమ్యం..


మంచి చెడు మారేదే..మనదన్నది మారేదే..


ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం..

Thursday, December 22, 2011

ఎత్తైన పాపికొండల పరవసాలు ..

గలగలమంటూ   గోదావరి  ఉరకలు ..


ఝుం ఝుం అంటూ  వాయుదేవుని  విన్యాసాలు ..
రయి  రయి మంటూ తెల్లటి  కొంగల  చక్కర్లు ..
జయహో  జయహో  అంటూ  ఎత్తైన  పాపికొండల పరవశాలు..
మాకుమేమే  సాటి  అంటూ  వివిధ రకాల  వృక్షాలు ..
ఆహా  ఒహో  అంటూ  నా  మనసు  నాట్యాలు ..

వీటిని వర్ణించి  చెప్పాలి  అంటూ  నా  కవిత్వం  ఆరాటాలు... 

అందుకే నీ స్నేహమంటే నాకు అమితమైన ఆసక్తి

మంత్రాలవంటి నీ మాటలతో మనసుపులకరించే మధురానుభూతి..  

ముందుకు నడిపే నీ మేచ్చుకోలుతో మడమతిప్పని  విజయానురక్తి ..
అమృతంలాంటి  నీ ఆత్మీయతతో అలవోకగా  సమస్యలనుండి విముక్తి..
నవవసంతము నిండిన  నీ  నవ్వుతో  భువనభోన్తరాలను జయించగలశక్తి ...
అందుకే  నీ స్నేహమంటే  నాకు  అమితమైన  ఆసక్తి...

Thursday, November 24, 2011

కాంతులీనే నీ కళ్ళలో మెరుస్తున్నాయి నక్షత్రాలు...




కాంతులీనే నీ కళ్ళలో మెరుస్తున్నాయి నక్షత్రాలు...
మమతను పంచే నీ మోములో తొంగి  చూస్తున్నది జాబిల్లి...
సంగీతమనిపించే నీ మాటలతో తేలియాడుతున్నాయి మేఘాలు...
తేజస్సుని నింపే నీ ప్రేరణతో వెలిగిపోతున్నాడు ఉదయభానుడు...
జీవాన్ని ఇచ్చే నీ ప్రోత్సాహముతో ప్రవహిస్తున్నాయి నదీ నాదాలు...


ప్రేమను పంచే నీ స్నేహంతో  పొరలుతున్నాయి  నా హృదయసాగరాలు....

Tuesday, November 22, 2011

స్నేహానికే సాధ్యం ఆ అద్బుతం...ఆలోచనకి అందదు ఆ సాహిత్యం..




కదిలే మబ్బుల లోన ... కుండల నిండా వాన 
తిరిగే  మనుషుల  లోన ...మనసుల నిండా బాధ 
చల్లని  గాలి కురిపించేను వాన...తీయని చెలిమి తొలగించేను బాధ..
స్నేహానికే  సాధ్యం ఆ అద్బుతం...ఆలోచనకి అందదు ఆ సాహిత్యం..
అంగడిలో దొరికేది కాదు స్నేహం .. కొందరికే అందేది ఆ విలువైన  వరం ..
నిద్ర  ఒక  మరణం..మెలుకువ  ఒక  జననం
ప్రతి  రోజూ  ఒక  తెల్ల  కాగితం..దాని  నిండా  నింపు  ఆనంద  గీతం...
ఎప్పటికైనా  గాలిలోకి  పోయే  ప్రాణం..బిగుసుకున్నాఅయిపోతుంది సమయం...
ఏమిటి  ఈ  మనిషి  జన్మ  ప్రయోజనం..మరి  కావాలా  మనకీ  పంతం..
మనసు  విప్పి  మాట్లాడుదాం....ఉందాం  స్నేహంగా  కలకాలం... 




 
 

Tuesday, November 1, 2011

నీ గురించి ఆలోచించకుండా ఉండటము అసాద్యమేమో....




నీ గురించి ఆలోచించకుండా ఉండటము అసాద్యమేమో....

నీ స్నేహశీలాన్ని గుర్తుచేసుకోకుండా గడపటము గగనప్రయత్నమేమో....

నీ వాక్ప్రవాహాన్ని వినకుండా ఉండాలనుకోవటము వృదా ప్రయాసేమో....

నీ తలపులకలలు కనకుండా కదలటము కన్నీటి ప్రవాహమేమో....

నీ చిరునవ్వులు చూడకుండా చలించటము చపలచిత్తమేమో...

నీ తోడు లేకుండా జీవించాలనుకోవటము జన్మజన్మల శాపమేమో...

  














Monday, October 31, 2011




రోజులు గడిచిపోతున్నాయి జ్ఞాపకాలుగా మారి.... 
జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మధుర స్మృతులుగా మారి.... 
మధుర స్మృతులు అలరిస్తున్నాయి ఆనంద సంద్రాలుగా మారి... 
ఆనంద సంద్రాలు పొంగుతున్నాయి కోటిసరాగాలుగా మారి..
కోటిసరాగాలు వినిపిస్తున్నాయి వీనులవిందులుగా  మారి...
వీనులవిందులు చేరుతున్నాయి హృదయస్పందనలుగా మారి.. 
హృదయస్పందనలు కలవరిస్తున్నాయి నీ నామావళిగా మారి...



జల జల జారే జలపాతపు సవ్వడి లా...
అప్పుడే ఉదయిస్తున్న ప్రభాత సూర్యుని వెలుగులా..
ఎండిపోయిన నేలపై పడి ప్రాణాన్ని నింపే చినుకు రవ్వలా..
రణ గొన ధ్వనులతో రోదిస్తున్న బిడ్డకు జోలపాటలా..  
తుఫానులో దారి తప్పి సంచరిస్తున్న నావకు ఒడ్డుకు చేరే సహాయములా..
కనిపించి తలపించి అలరించే నీ నవ్వు చూస్తూ ఉండాలని ఉంది ఎల్లవేళలా...

Sunday, October 23, 2011

నీవాడను నేను....నీ కొరకు వేచిఉంటాను నేను...



 కలలే అలలై కలిసాయి నిన్నే
మదిలో మధువై మురిసాయి మరులే
ఎలా ఎలాగ అంటోంది మది
నిజమే జరిగేను అంటోంది నా ఎద
మరిచింది లేదు తలవంది లేదు ప్రతిక్షణం
పదునైన నీ చూపు ప్రియమైన నీ పిలుపును అనుక్షణం
ఏ నేలనున్నా ఏ పిలుపువిన్నా నీ నామమే
మమతల కొలువైన నీవే నా మనుగడకు మార్గం
  

నీ పిలుపు వినాలని నీ మోము దర్శించాలని ఆశ
గడియ గడియను నీ పాదాల చెంత ఉంచాలని ఉబలాటం
నా జీవన జ్యోతీ నా ఆశల ఆక్రుతీ
అనురాగపు ఆలయమా అర్చనలేని ఓ ఆదిశక్తీ......
నీవాడను నేను....నీ కొరకు వేచిఉంటాను నేను...
నా తుది శ్వాస వరకు....
                               ------ప్రభాకర రావు కోటపాటి

    

Sunday, March 27, 2011

వర్ణణాతీతం నా ఆనందం

వర్ణణాతీతం నా ఆనందం
ఆశ్చర్యభరితం నా చిత్తం
ప్రమోదసద్రుశం నా నేత్రద్వయం
పుష్పాలంక్రుతం నా హ్రుదయం

ఇన్ని భావనలు ఒక్కక్షణంలో
మిన్ను దాటాయి ఆమె రాకతో

ప్రకంపనలతో దేహం ద్రవించింది
మౌనగీతాలతో మనస్సు ఆలాపించింది
ఉల్లాసంతో ఊపిరి ఊగిపోయింది
ఆమె పలుకరింపుతో ప్రాణం లేచివచ్చింది

స్వర్గంలో ఉన్నానా అన్న ఆలోచనలు
మదిలో మల్లెల గుభాలింపులు
కళ్ళలో వెల్లువలా విద్యుత్తుకాంతులు
చెవులలో సెలయేరుల సవ్వడులు

చెలరేగాయి చేరువయ్యాయి
చలింపచేసాయి చైతన్యపరచాయి

కల నిజమైన ఆ మధురక్షణాలు
ఇల నిలిచిన ఆ దేవత దయా వీక్షణాలు
శిలపై లిఖించదగినవి ఆ సువర్ణాక్షరాలు
చెలి చెంతనిలిచిన ఆ అమ్రుత ఘడియలు
ఎలా మరువగలను! ఆమెను.... అది అసాద్యమేమో!



                      ------ప్రభాకర రావు కోటపాటి

Saturday, March 26, 2011

నీ స్నేహామ్రుతం నఖశిఖ పులకాంకితం



నీ స్నేహామ్రుతం నఖశిఖ పులకాంకితం

ఆనందవదనం అనుపమాన దేదీప్యం

కరుణరసపూరిత కనకదుర్గ స్వరూపం


అద్బుతదరహాస అధరద్వయం

విజయసారద్యసహిత విలక్షణ విగ్రహం

నిర్మల కార్యాచరణ నిస్వార్ద త్యాగశీలం


నిత్యప్రేరణశోభిత నిజనాయకత్వం

అనంతవిశాలక్షరచిత ఆలోచనాపర్వం

సకలజనులనుకాచే సేవాభావం


వీనులవిందైన వాక్కులప్రవాహం

భువనభోంతరాలునిండే భావసౌందర్యం

దయనువర్షించే దేవతామూర్తిత్వం


రమనీయతాధర రాజపూజ్యవ్యక్తిత్వం

గమ్యనిర్దేశిత గంగాభవాని స్వరూపం

చైతన్యప్రధాత నాకు అనుక్షణం



                      ------ప్రభాకర రావు కోటపాటి

Sunday, March 20, 2011


అయిపోయింది కాలచక్రంలో ఒకరోజు

గడిచిపోయాయి శ్రమక్రమములో కొన్నిగంటలు
కురిపిస్తోంది నిండుచందమామ పండువెన్నెలలు
కాంతులీనుతోంది నక్షత్రమండలం మిలమిలకాంతులతో
వేచిచూస్తుంది నీ కలలరాజ్యం నీ రాకకోసం
స్వాగతిస్తుంది విశ్రాంతి రాత్రి నిశబ్ద నిముషాలతో
కదిలిసాగుతుంది చల్లటిగాలి వింజామరలతో
సాగిపోయి సేదతీరు మిత్రమా ఆ ఆనంద నిద్రావస్థలో

                                                          --మాలతి