తలచినదే జరిగినదా దైవం ఎందులకు ..
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు..
ముగిసినగాధ మొదలిడదు దేవుని రచనలలో..
మొదలిడుగాధ ముగిసేదెపుడో మనుషుల బ్రతుకులలో ..
మనసునకేన్నో మార్గాలు.. కనులకుఎన్నో స్వప్నాలు..
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు ..
యెదలో ఒకరే కుదిరిన నాడు మనసే ఒక స్వర్గం..
ఒకరుండగా వేరోకరోచ్చారా లోకం ఒక నరకం..
ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం ఏది నిజమౌ బంధం..
ఏది అనురాగం ఏది ఆనందం బ్రతుకునకేదీ గమ్యం..
మంచి చెడు మారేదే..మనదన్నది మారేదే..
ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం..

No comments:
Post a Comment