ఓ దైవమా...
ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి...
నా సర్వస్వం నీ కిస్తా... నా బాల్యం నా కిచ్చేయి
ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి..
అమ్మ గుండెలో దూరి... ఆనందంతో తుళ్ళి...
ఆదమరచి నిదరోయే...ఆ సౌక్యం నా కిచ్చేయి...
ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నా కిచ్చేయి...
కేరింతలతో కుదిపి...బుల్లి బొంతలను తడిపి...
ఊయల కొలువును ఏలే...ఆ బాగ్యం నా కిచ్చేయి...
ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి..
చెత్తని వేసే బుట్ట... పాత సామాను పుట్ట...
విరిగినవన్నీ నావే...నా బాల్యం నా కిచ్చేయి...
అమ్మ లాలనకు ముందు...బ్రహ్మ వేదాలు బందు...
ముక్తి కేలనే మనసా....బాల్యం కోసం తపస్సు చేయి...
ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి..
---గానం...గజల్ శ్రీనివాస్
http://www.ghazalsrinivas.com/telugu/aboutsrinivas.htm

No comments:
Post a Comment