జాజి మల్లెల జలపాతమా....
మనసు దోచిన మన్మధ బాణమా...
నన్ను నిలువనీయని నయగారమా...
వచ్చి చేరిన వసంతమా...
నీ సంస్కారం సమ్మోహనాస్త్రం...
నీ పిలుపులు పిల్లన గ్రోవి సంగీతం..
నీ నయనాలు నక్షత్ర మండలం...
నీ హొయలు హ్రుదయానందకరం...
మాట మాటలో దొరలు ముత్యాలు..
చూపు చూపులో చిలుకు చిరుజల్లులు...
నవ్వు నవ్వులో పలుకు నవ్యరాగాలు...
కదిలే కదలికలో కురియు పుష్ప వర్షాలు..
అలంకరణ అవసరము లేని ఆలయశిఖరం నీవు...
ఎవరూ ఎత్తి చూపలేని శక్తి స్వరూపం నీవు...
చిత్రకారులకు అందని చైతన్య స్వరూపం నీవు...
గాయకులు ఆలపించలేని అనంత రాగం నీవు...
అందుకే అందుకో నా ఈ హ్రుదయాభినందనలు...
మనసు దోచిన మన్మధ బాణమా...
నన్ను నిలువనీయని నయగారమా...
వచ్చి చేరిన వసంతమా...
నీ సంస్కారం సమ్మోహనాస్త్రం...
నీ పిలుపులు పిల్లన గ్రోవి సంగీతం..
నీ నయనాలు నక్షత్ర మండలం...
నీ హొయలు హ్రుదయానందకరం...
మాట మాటలో దొరలు ముత్యాలు..
చూపు చూపులో చిలుకు చిరుజల్లులు...
నవ్వు నవ్వులో పలుకు నవ్యరాగాలు...
కదిలే కదలికలో కురియు పుష్ప వర్షాలు..
అలంకరణ అవసరము లేని ఆలయశిఖరం నీవు...
ఎవరూ ఎత్తి చూపలేని శక్తి స్వరూపం నీవు...
చిత్రకారులకు అందని చైతన్య స్వరూపం నీవు...
గాయకులు ఆలపించలేని అనంత రాగం నీవు...
అందుకే అందుకో నా ఈ హ్రుదయాభినందనలు...
No comments:
Post a Comment