---తల్లిదండ్రులు తమ పిల్లలను కోరుకొనేదేమిటి అనేదే ఈ గజల్...
ముసలి వయసులో నేనుంటే..నను ప్రేమిస్తావా కన్నా..
బహుదూరంలో నీవుంటే.. వచ్చి కనిపిస్తావా కన్నా..

నా కన్నులు కనపడకుంటే.. చీకటి సవాలు చేస్తుంటే..
నా కనురెప్పలు పైకెత్తి..లోకం చూపిస్తావా కన్నా..

నా అడుగులు పడకుంటే..ఎలా అడగాలో తెలియకుంటే..
నా మనసు మాటను..నీ మనసుతో ఆలకిస్తావా కన్నా..

తీరిక లేక నీవుంటే.. చూసే కోరిక నాకుంటే...
ఎపుడో ఒకసారైనా.. కాస్త పలకరిస్తావా కన్నా...

రెండవ బాల్యము ముసలితనం..ఆసరా తో చివరిక్షణం..
గోరుముద్దలో అమ్మవై.. మమత కురిపిస్తావా కన్నా...

---రచన: రసరాజు గానం: గజల్ శ్రీనివాస్

No comments:
Post a Comment