Monday, February 20, 2012

చంచలమై చరిస్తుంది నా మూగ మనసు ..

ఎదురుచూస్తుంది  మనసు  
ఎగిసిపడుతుంది  మనసు 
మనసుని  దోచుకున్న  మనిషి  ఎక్కడంటుంది  మనసు 

ఆమె  తలపులతో  నిండిపోయింది మనసు ..
ఆమె  స్నేహం  కోసం  పరితపిస్తుంది  మనసు 
ప్రేమని  పంచిన  ప్రేయసి  ఎప్పుడువస్తుంది  అంటుంది  మనసు ..

కలలు  కలలుగా  పొరలిపోతుంది  మనసు 
ఉరకలు  ఉరకలుగా  ఊగిపోతుంది  మనసు 
ఆనందపు  అంచులలో  తేలిపోయే  ఘడియ 

త్వరలోవస్తుంది  అంటుంది  మనసు

మనసులో  మనసై  మునిగిపోయే  మధుర  క్షణాలకోసం  

క్షణ క్షణం  క్షోబిస్తుంది  నా  పిచ్చి  మనసు ..
చేతిలో  చెయ్యేసి  చెప్పుకోబోయే  ఊసులకోసం  

చంచలమై  చరిస్తుంది  నా  మూగ  మనసు ..

                                   --ప్రభాకర రావు కోటపాటి 

Sunday, February 19, 2012

చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు

--తండ్రి తన బాల్యములో నేర్పిన విద్యల రహస్యాన్ని గుర్తించిన కుమారుని భావలహరి ఈ గజల్--

చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు  
నాకేమో నాన్న విలువ ఎంతన్నది.. తెలియలేదు 

చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు  

నాన్న నాకు చొక్కా  తొడగటమే తెలిసింది గానీ...
కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు

చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు  

ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గానీ.. 
తనకన్నా ఎత్తున నిలపెడుతున్నది తెలియలేదు 

చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు  

చేయి పట్టి నాన్న నడిపించుట తెలుసు గాని..
నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు 

చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు  

ఈతకొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు గానీ 
నా తెగువకు ఉగ్గు పాలు పడుతున్నది తెలియలేదు 

చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు  

ఏమి తండ్రి రెంటాల..కన్నీళ్లను కూడ దాచి..
నాకై చెమటగా ఖర్చుపెడుతున్నది తెలియలేదు...

చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు  

నా జీవం నా సారం చీల్చి చూసుకొంటే గాని..
నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు..

చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు  
నాకేమో నాన్న విలువ ఎంతన్నది.. తెలియలేదు...

రచన: రెంటాల      గానం: గజల్ శ్రీనివాస్ 

ముసలి వయసులో నేనుంటే..నను ప్రేమిస్తావా కన్నా

---తల్లిదండ్రులు తమ పిల్లలను కోరుకొనేదేమిటి అనేదే ఈ గజల్...

ముసలి  వయసులో నేనుంటే..నను ప్రేమిస్తావా కన్నా.. 
బహుదూరంలో నీవుంటే.. వచ్చి కనిపిస్తావా కన్నా.. 

ముసలి  వయసులో నేనుంటే..నను ప్రేమిస్తావా కన్నా.. 

నా కన్నులు కనపడకుంటే.. చీకటి సవాలు చేస్తుంటే..
నా కనురెప్పలు పైకెత్తి..లోకం చూపిస్తావా కన్నా..

ముసలి  వయసులో నేనుంటే..నను ప్రేమిస్తావా కన్నా.. 

నా అడుగులు పడకుంటే..ఎలా అడగాలో తెలియకుంటే..
నా మనసు మాటను..నీ మనసుతో ఆలకిస్తావా కన్నా..

ముసలి  వయసులో నేనుంటే..నను ప్రేమిస్తావా కన్నా.. 

తీరిక లేక నీవుంటే.. చూసే కోరిక నాకుంటే...
ఎపుడో ఒకసారైనా.. కాస్త పలకరిస్తావా కన్నా...

ముసలి  వయసులో నేనుంటే..నను ప్రేమిస్తావా కన్నా.. 

రెండవ బాల్యము ముసలితనం..ఆసరా తో చివరిక్షణం..
గోరుముద్దలో అమ్మవై.. మమత కురిపిస్తావా కన్నా...

ముసలి  వయసులో నేనుంటే..నను ప్రేమిస్తావా కన్నా.. 

    ---రచన: రసరాజు           గానం: గజల్ శ్రీనివాస్ 

తిన్నావా లేదా.. అని అడిగానా ఎపుడైనా...

----భార్య విలువను తెలుసుకొన్న భర్త పాడే గజల్----

తిన్నావా లేదా.. అని అడిగానా ఎపుడైనా...
నడుం వాల్చలేదేమని..  అన్నానా ఎపుడైనా..

తిన్నావా లేదా.. అని అడిగానా ఎపుడైనా...

చీర నీకు బాగుందని.. పొగిడానే గానీ...
ఆ చీరకు నీవే సొగసని.. అన్నానా ఎపుడైనా..

తిన్నావా లేదా.. అని అడిగానా ఎపుడైనా...

జడలో మల్లెల వాసనా... పీల్చానే గానీ...
తన మనసులోని పరిమళాన్ని చూసానా ఎపుడైనా...

తిన్నావా లేదా.. అని అడిగానా ఎపుడైనా...

ముసురు వేళ వేడి వంట.. తిన్నానే గానీ...
నీ ప్రేమకింత రుచి ఉందని.. అన్నానా ఎపుడైనా..

తిన్నావా లేదా.. అని అడిగానా ఎపుడైనా...

బండ చాకిరి నీదనీ...భావించానే గానీ..
చెంపనంటిన చెమట తుడిచి.. ముద్దు పెట్టానా ఎపుడైనా..

తిన్నావా లేదా.. అని అడిగానా ఎపుడైనా...

అర్దాంగివి కావు నీవు... అనురాగాదేవతవు..
రసరాజై ఈ నిజాన్ని.. రాస్తానా ఎపుడైనా...

తిన్నావా లేదా.. అని అడిగానా ఎపుడైనా...

              ---రచన: రసరాజు           గానం: గజల్ శ్రీనివాస్ 

ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి...

ఓ దైవమా...

ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి... 
నా సర్వస్వం నీ కిస్తా... నా బాల్యం నా కిచ్చేయి 

ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి..  

అమ్మ గుండెలో దూరి... ఆనందంతో తుళ్ళి... 
ఆదమరచి నిదరోయే...ఆ సౌక్యం నా కిచ్చేయి...

ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నా కిచ్చేయి...

కేరింతలతో కుదిపి...బుల్లి బొంతలను తడిపి...
ఊయల కొలువును ఏలే...ఆ బాగ్యం నా కిచ్చేయి...

ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి..  

చెత్తని వేసే బుట్ట... పాత సామాను పుట్ట...
విరిగినవన్నీ నావే...నా బాల్యం నా కిచ్చేయి...

అమ్మ లాలనకు ముందు...బ్రహ్మ వేదాలు బందు...
ముక్తి కేలనే మనసా....బాల్యం కోసం తపస్సు చేయి...

ఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి..  

                        ---గానం...గజల్ శ్రీనివాస్ 

http://www.ghazalsrinivas.com/telugu/aboutsrinivas.htm