Sunday, April 19, 2020

అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం

నీతోడున్న ఈ క్షణమే నాకు ఆనంద సంద్రం 
కదిలే కాలంతో కరిగిపోయేనేమో నా సంబరం
ఎదురయ్యెనేమో నీవు లేకనే గడిపే గమనం
ఎదురయ్యెనేమో నేనునేనులా లేని ప్రమాదం 

మన దారులు వేరై పోయేనేమో 
నడిచి నడిచి మనమే కనుమరుగయ్యేనేమో 

అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం
అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం
ఎప్పటికైనా నా ప్రాణం  విడిచేది నీ కోసం
అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం

నా ప్రియతమా, అనుక్షణమూ నీ ఊహలలో
నీ ప్రేమాలాపనతో బ్రతికేస్తా 

అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం
అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం
ఎప్పటికైనా నా ప్రాణం  విడిచేది నీ కోసం
అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం

ఊపిరికోసం గాలిలాగా  నీతోడు నా సర్వస్వం
నడకకోసం భూమిలాగా నాచూపు నీ కోసం 

నవ్వినా ఏడ్చినా నా కనులు 
పిచ్చిగా వెదికేది మాత్రం నీ కోసం...

దయలేని  కాలం చేసేనేమో నీ ప్రేమ దూరం
మారిపోయిన మనసు చెసేనేమో నిర్లక్ష్యం 
పగిలిన ఆ గుండె ముక్కలతో..
నీ ముంగిట వేచి ఉండేది మాత్రం నిత్యసత్యం

అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం
అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం
ఎప్పటికైనా నా ప్రాణం  విడిచేది నీ కోసం
అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం

నీ తోడు దొరికిన నా జీవితం 
నిండిపోతుంది నాలో అనందం
నీవు పలికే ప్రతి మాట నాకు సంగీతం
తేలి పోతుంది నా హృదయం 

రాత్రి పగలంతా ఎదో ఆహ్లాదం 
ఇదంతా నీ తోడుతో  జరిగిన విచిత్రం 

ఈ అనుబందం అన్నివేళలా అందునో లేదో 
నీవెక్కడో నేనెక్కడో ఉండి పోయేనేమో
కానీ నీవు తలచిన క్షణమే..
వాయువేగంతో వచ్చి వాలేది మాత్రం నిజం 

అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం
అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం
ఎప్పటికైనా నా ప్రాణం  విడిచేది నీ కోసం
అయినప్పటికీ నా గుండె నడిచేది నీ కోసం


       - ప్రభాకర రావు కోటపాటి





No comments:

Post a Comment