ధగ ధగలు నిండిన దారుల వెంట
నా ఎదురు చూపులేమో నీ కోసం..
అణువు అణువూ నా మనసంతా
రాసేస్తున్నా నీ పేరు మీద..
నన్ను నేనే మరచి పోయా
కానీ నీ కలలతో తేలిపోతున్నా
కొద్ది కొద్దిగా నా జీవితమంతా
అయిపోయింది నీ అధీనంగా..
ప్రాణమా ఓ నా ప్రాణమా
నువ్వే నా ప్రాణమై పోయావే..
దీపమా ఓ నా దీపమా
నువ్వే నా దీపమై పోయావే..
ప్రాణమా ఓ నా ప్రాణమా
నువ్వే నా ప్రాణమై పోయావే..
నీకు దగ్గర అయిన ప్రతి క్షణమూ
నా భ్రమలన్నీ తొలగి పోయాయే
ప్రాణమా ఓ నా ప్రాణమా
నువ్వే నా ప్రాణమై పోయావే..
నల్లని మబ్బు లాగా నాకు నీడ నిచ్చావు
విరిజల్లు లాగా నాపై అనందాన్ని వర్షించావు
తుఫానులా తలపులన్నీ ఎగరేసుకు పోయావు..
నా అదృష్ట దేవతవే నీవు
నాకో నవోదయమై అవతరించావు
నీతో కలయికే అతి పెద్ద వరమే నాకు
ఎన్ని జన్మలైనా వీడలేను నీ తోడు..
ప్రాణమా ఓ నా ప్రాణమా
నువ్వే నా ప్రాణమై పోయావే..
దీపమా ఓ నా దీపమా
నువ్వే నా దీపమై పోయావే..
ప్రాణమా ఓ నా ప్రాణమా
నువ్వే నా ప్రాణమై పోయావే..
-ప్రభాకర రావు కోటపాటి
No comments:
Post a Comment