ఈ జాతికి జన్మనిచ్చినది
ఈ సృష్టి ఉనికికి ఊతమిచ్చినది
ఈ మనిషి మనుగడకి మార్గమైనది
ప్రతి ఇంటికి ప్రకాశమిచ్చేది
ఆమే ఆమే ఆమే....... మహిళ
స్వతంత్ర పోరాటం చేసింది ఝాన్సీ లక్ష్మి భాయి
శివాజీని తయారు చేసింది జిజియా భాయి
భర్తతో అడవులకు అనుసరించింది సీతా దేవి
సత్యం కోసం అమ్ముడుపోయింది చంద్రమతి
యమునితో తలపడింది సతీ సావిత్రి
మహిళ లేకపోతే చరిత్ర లేదు
మహిళ లేకపోతే విలువలకు ప్రాణం లేదు
మహిళ లేకపోతే అభివృద్ధి లేదు
మహిళ లేకపోతే ఈ సృష్టికే కళ లేదు
ప్రేమకు ప్రతిరూపం
త్యాగానికి తలమానికం
సేవకు తాత్పర్యం
కళలకు ఆధారం
కనకదుర్గ స్వరూపం మహిళ
మానవత్వానికి మారు పేరు మదర్ తెరిస్సా
దేశ ప్రజల గుండెల్లో కోలువైయినది మాజీ ప్రదాని ఇందిరా గాంధి
గగనసీమలకు ధైర్యముగా వెళ్ళింది కల్పనాచావ్ల
భారత దేశానికి ప్రదమ మహిళ ప్రతిభా పాటిల్
లోక్ సభకు అధ్యక్షురాలిగా ఎదిగింది మీరా కుమారి
మానవవనరుల అభివృద్ధికి మంత్రి పురంధరేశ్వరి
కరడుకట్టిన కిరాతకులను మార్చింది కిరణ్ బేడీ
అతిపెద్ద బ్యాంకు ఐసి ఐసి ఐ కి నేత చందా కోచ్చర్
విదేశి కంపెనీ పెప్సి కి స్పూర్తి ఇందిరా నోఈ
టెన్నిస్ క్రీడలో పెద్ద విప్లవం సానియా మీర్జా
బరువు లెత్తిన బలమైన మహిళ కరణం మల్లేశ్వరి
ఆమె చేయలేనిది లేదు
ఆమె మార్చలేనిది లేదు
ఆమె ఎక్కలేని ఎత్తు లేదు
ఆమె పలుకలేని పలుకు లేదు
సరస్వతి నిలయం
లక్ష్మి కటాక్షం
అన్నపూర్ణ అనుగ్రహం
అన్ని కలిసి మెలిసి ఉద్భవించిన రూపమే మహిళ
కూతురుగా ఆనందాన్నిచ్చినా
చెల్లిగా అనురాగాన్నిచ్చినా
అక్కగా నడవడికనేర్పినా
భార్యగా బాధ్యతలు మోసినా
అమ్మగా ఆధారమయి పెంచినా
అలసిపోదు ఆగిపోదు ఆమె
చేదిరిపోదు చెరిగిపోదు ఆమె చిరునవ్వు
అందుకే ఓ మహిళా అందుకో నా ఈ అభినందన మందార మాల
--ప్రభాకర రావు కోటపాటి
--ప్రభాకర రావు కోటపాటి
English Translation by: Venkata Krishna Kanth Petluri
The mother of every race,
The support behind the creation,
The means of human survival,
She is… WOMAN.
Jhansi lakshmi bai fought for the freedom,
Jijiya bai nurtured a great warrior, Sivaji
Sita devi, followed her husband even to forests,
Chandramati, sold herself for the truth,
Savithri, fought with the Lord of death for her husband.
No history can exist without the woman,
No values can survive without the woman,
No development can take place without the woman,
The universe loses its glory without the woman.
She is,
The personification of love,
The epitome of sacrifice,
The definition of service,
The inspiration behind every art,
The manifestation of the almighty.
The synonym of humanity, Mother Theresa
Lived in the hearts of people forever, Indira Gandhi
Rose to heights of the skies, Kalpana Chavla
First woman to the largest democracy, Pratibha Patil
Speaker of Indian Lok Sabha, Meera Kumari
Minister of Human Resource Development, Purandhareswari
Reformer of tough hearts of criminals, Kiran Bedi
Running largest private bank successfully, Chanda Kochar
The strength behind PepsiCo, Indra Nooyi
The proven star of Tennis, Sania Mirja
There’s nothing a woman cannot do
There’s nothing she cannot change
There are no heights she cannot reach
There is no speech she cannot speak.
She is the,
Goddess of education,
Goddess of wealth,
Goddess of food,
Greatest in everything.
Showers happiness as a daughter,
Shows affection as a younger sister,
Shapes character as an elder sister,
Shares responsibilities as a wife,
Raises as a mother.
She never exhausts, she never stops,
And her smile never disappears.
Woman! Please accept my garland of tribute!!

No comments:
Post a Comment