Sunday, December 22, 2019

భారతాన బహు సుందరం మన మహానగరం

ఎందరికో బసగా మారెను మన భాగ్యనగరం
భారతాన బహు సుందరం మన మహానగరం
 
వట్టి చేతులతో వచ్చిన వారికి వారధి 
రక రకాల వృత్తులకు అలవాలం
సకల కుల మతాల సమ్మేళనం 
లలిత కళల నిలయమైన నర్తనశాల 

చరిత్రను చూపే కట్టడాలు ఒక వైపు 
అధునాతన సాంకేతిక సంస్థలు మరొక వైపు 
నల భీమ పాకాలు వండించే పాకశాలలు
అనేక తటాకాలతో అలరారే జల నిలయం 

గుండ్రని బండలు అందమైన దారులు
ఆకాశమంత ఎత్తులో బుద్ద విగ్రహం
ముత్యాల సిరులతో పాలరాతి మందిరం
ప్రపంచ దేశాలను కలిపే విమానాశ్రయం 

విలక్షణ విద్యలు నేర్పే విద్యాలయాలు 
సత్వర ఆరోగ్య సేవల వైద్యశాలలు  
పరుగు పరుగున ముందుకు సాగే మెట్రో 
కొంగొత్త స్నేహలనందించే స్వర్గ సీమ

ఎందరికో బసగా మారెను మన భాగ్యనగరం
భారతాన బహు సుందరం మన మహానగరం

          -ప్రభాకర రావు కోటపాటి 

Saturday, December 21, 2019

ఓ సఖియా నా ప్రియతమా జన్మ జన్మ లకి నువ్వే నా అనుభందమా

తలచేది నిన్నే వలచేది నిన్నే
నువ్వే నా ప్రాణమా
పిలిచేది నిన్నే కోరేది నిన్నే 
నువ్వే నా జీవితమా

నా నడకంతా నీ కొరకే
నా మనసంతా నీ మమతే 
నీ స్నేహమే నా శ్వాసఅయితే 

ఓ సఖియా నా ప్రియతమా 
జన్మ జన్మ లకి నువ్వే నా అనుభందమా 

నిన్ను చూడని రోజేమో 
లోకమంతా చీకటయితే 
నువ్వు లేని బ్రతుకయితే 
అసలు సాద్యమేనా...

క్షణ క్షణము నీ కలలే 
ఊహలన్నీ నీ ఊసులే 
పగలంతా నీ ద్యాసే 
రాత్రయినా నువ్వు వీడవులే..

నా నడకంతా నీ కొరకే
నా మనసంతా నీ మమతే 
నీ స్నేహమే నా శ్వాసఅయితే 

ఓ సఖియా నా ప్రియతమా 
జన్మ జన్మ లకి నువ్వే నా అనుభందమా 

విది వింత నాటకంలో
మన దూరం పెరిగినా 
చెదరిపోని మన స్నేహంతో
మన కలయిక మాత్రం ఆపలేనిదిలే..

నా నడకంతా నీ కొరకే
నా మనసంతా నీ మమతే 
నీ స్నేహమే నా శ్వాసఅయితే 

ఓ సఖియా నా ప్రియతమా 
జన్మ జన్మ లకి నువ్వే నా అనుభందమా 




Tuesday, December 19, 2017

అమ్మ అరచేతి స్పర్షయే అన్నమయ్యే 
అమ్మ హృదయమ్ము పొంగి క్షీరాన్నమయ్యే 
అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రములయ్యే 
అమ్మ పాదాలు యతియు ప్రాసమ్ములయ్యే 


                 — గరికపాటి నరసింహరావు 

--



Regards
Prabhakar Rao Kotapati


Monday, December 18, 2017

ధర్మ మార్గమున చనుమా కలుగు సంపదలున్ 
అవినీతితో కూడపెట్టిన ధనం మూలమ్ముగాదె అవస్థలకున్ 
జనులు గానకున్నా జగన్నాధుడు కనడే  నీ నడవడికలన్ 
నీ కర్మలే కారణమ్ము కాదే నీ జీవన అభ్యుదయమ్మునకున్ 

--



Regards
Prabhakar Rao Kotapati


హనుమ మనోజ్ఞ వైభవము స్లాఘనీయము 
నీవు అనయముగా సఖా వినుము 
అద్భుతమౌ చరితమ్ము ఇదే 
మహామనుమయమిద్ది 
అనుమా వినుమా స్తవనీయ సద్గతుల్ 
--



Regards
Prabhakar Rao Kotapati


హుంకారము చేయుచున్ 
ప్రగతికై హేమమ్ము పండించుచున్ 
రంభ శ్రీవర దుష్టతన్ 
సంహారమ్మును చేసెదన్ 
జగతిలో శాంతిని ప్రతిష్టింపగున్ 
--



Regards
Prabhakar Rao Kotapati


Sunday, December 17, 2017

ఆ ఘన రావణాసురుని 
ఆ అగ్ని మదస్త్రముతోడ కాల్చితే 
రాఘవ నీదు బాణము కరమ్ము ప్రశస్తము గాదే 
బూరి ఘోరాఘవ నీ ఖుటరామును 
ప్రార్థన చేసెద భక్తి తోడన్ 
--



Regards
Prabhakar Rao Kotapati