తలచేది నిన్నే వలచేది నిన్నే
నువ్వే నా ప్రాణమా
పిలిచేది నిన్నే కోరేది నిన్నే
నువ్వే నా జీవితమా
నా నడకంతా నీ కొరకే
నా మనసంతా నీ మమతే
నీ స్నేహమే నా శ్వాసఅయితే
ఓ సఖియా నా ప్రియతమా
జన్మ జన్మ లకి నువ్వే నా అనుభందమా
నిన్ను చూడని రోజేమో
లోకమంతా చీకటయితే
నువ్వు లేని బ్రతుకయితే
అసలు సాద్యమేనా...
క్షణ క్షణము నీ కలలే
ఊహలన్నీ నీ ఊసులే
పగలంతా నీ ద్యాసే
రాత్రయినా నువ్వు వీడవులే..
నా నడకంతా నీ కొరకే
నా మనసంతా నీ మమతే
నీ స్నేహమే నా శ్వాసఅయితే
ఓ సఖియా నా ప్రియతమా
జన్మ జన్మ లకి నువ్వే నా అనుభందమా
విది వింత నాటకంలో
మన దూరం పెరిగినా
చెదరిపోని మన స్నేహంతో
మన కలయిక మాత్రం ఆపలేనిదిలే..
నా నడకంతా నీ కొరకే
నా మనసంతా నీ మమతే
నీ స్నేహమే నా శ్వాసఅయితే
ఓ సఖియా నా ప్రియతమా
జన్మ జన్మ లకి నువ్వే నా అనుభందమా
No comments:
Post a Comment