ఎందరికో బసగా మారెను మన భాగ్యనగరం
భారతాన బహు సుందరం మన మహానగరం
వట్టి చేతులతో వచ్చిన వారికి వారధి
రక రకాల వృత్తులకు అలవాలం
సకల కుల మతాల సమ్మేళనం
లలిత కళల నిలయమైన నర్తనశాల
చరిత్రను చూపే కట్టడాలు ఒక వైపు
అధునాతన సాంకేతిక సంస్థలు మరొక వైపు
నల భీమ పాకాలు వండించే పాకశాలలు
అనేక తటాకాలతో అలరారే జల నిలయం
గుండ్రని బండలు అందమైన దారులు
ఆకాశమంత ఎత్తులో బుద్ద విగ్రహం
ముత్యాల సిరులతో పాలరాతి మందిరం
ప్రపంచ దేశాలను కలిపే విమానాశ్రయం
విలక్షణ విద్యలు నేర్పే విద్యాలయాలు
సత్వర ఆరోగ్య సేవల వైద్యశాలలు
పరుగు పరుగున ముందుకు సాగే మెట్రో
కొంగొత్త స్నేహలనందించే స్వర్గ సీమ
ఎందరికో బసగా మారెను మన భాగ్యనగరం
భారతాన బహు సుందరం మన మహానగరం
-ప్రభాకర రావు కోటపాటి