Thursday, November 24, 2011

కాంతులీనే నీ కళ్ళలో మెరుస్తున్నాయి నక్షత్రాలు...




కాంతులీనే నీ కళ్ళలో మెరుస్తున్నాయి నక్షత్రాలు...
మమతను పంచే నీ మోములో తొంగి  చూస్తున్నది జాబిల్లి...
సంగీతమనిపించే నీ మాటలతో తేలియాడుతున్నాయి మేఘాలు...
తేజస్సుని నింపే నీ ప్రేరణతో వెలిగిపోతున్నాడు ఉదయభానుడు...
జీవాన్ని ఇచ్చే నీ ప్రోత్సాహముతో ప్రవహిస్తున్నాయి నదీ నాదాలు...


ప్రేమను పంచే నీ స్నేహంతో  పొరలుతున్నాయి  నా హృదయసాగరాలు....

Tuesday, November 22, 2011

స్నేహానికే సాధ్యం ఆ అద్బుతం...ఆలోచనకి అందదు ఆ సాహిత్యం..




కదిలే మబ్బుల లోన ... కుండల నిండా వాన 
తిరిగే  మనుషుల  లోన ...మనసుల నిండా బాధ 
చల్లని  గాలి కురిపించేను వాన...తీయని చెలిమి తొలగించేను బాధ..
స్నేహానికే  సాధ్యం ఆ అద్బుతం...ఆలోచనకి అందదు ఆ సాహిత్యం..
అంగడిలో దొరికేది కాదు స్నేహం .. కొందరికే అందేది ఆ విలువైన  వరం ..
నిద్ర  ఒక  మరణం..మెలుకువ  ఒక  జననం
ప్రతి  రోజూ  ఒక  తెల్ల  కాగితం..దాని  నిండా  నింపు  ఆనంద  గీతం...
ఎప్పటికైనా  గాలిలోకి  పోయే  ప్రాణం..బిగుసుకున్నాఅయిపోతుంది సమయం...
ఏమిటి  ఈ  మనిషి  జన్మ  ప్రయోజనం..మరి  కావాలా  మనకీ  పంతం..
మనసు  విప్పి  మాట్లాడుదాం....ఉందాం  స్నేహంగా  కలకాలం... 




 
 

Tuesday, November 1, 2011

నీ గురించి ఆలోచించకుండా ఉండటము అసాద్యమేమో....




నీ గురించి ఆలోచించకుండా ఉండటము అసాద్యమేమో....

నీ స్నేహశీలాన్ని గుర్తుచేసుకోకుండా గడపటము గగనప్రయత్నమేమో....

నీ వాక్ప్రవాహాన్ని వినకుండా ఉండాలనుకోవటము వృదా ప్రయాసేమో....

నీ తలపులకలలు కనకుండా కదలటము కన్నీటి ప్రవాహమేమో....

నీ చిరునవ్వులు చూడకుండా చలించటము చపలచిత్తమేమో...

నీ తోడు లేకుండా జీవించాలనుకోవటము జన్మజన్మల శాపమేమో...