Tuesday, January 14, 2014

ఇది మనుషులకు ఇతర జీవులతో ఎవరూ విడదీయలేని సంబందం

అకాశమంత కనులతో దీవించే ఆవు
ఆపకుండా ఊపే తోకతో ప్రేమకురిపించే శునకం
కొక్కరొక్కో కూతతో నిద్ర లేపే కోడిపుంజు
రంగు రంగుల రెక్కలతో నాట్యం చేసే నెమలి

ఎన్ని జీవులు మన కోసం
వాటి మనుగడే మన ఆనందం కోసం 

తీయనైన కూతతో వీనులవిందు చేసే కోకిల 
పంటను ఎలుకల బారి నుండి కాపాడే నాగరాజు 
భూమిని సారవంతముగా మార్చే వానపాము
పూలపై వాలి పర పరాగ సంపర్కానికి తొడ్పడే తేనెటీగ 

ఎన్నో జీవుల సహకారం మన అహారం
ఇది మనుషులకు ఇతర జీవులతో ఎవరూ విడదీయలేని సంబందం

Friday, December 21, 2012

నీవు లేని నేను ...ఎలా గడప గలను..నీ పిలుపు వినని నేను ఎలా మనగలను..

నీవు లేని నేను ...ఎలా గడప గలను..
నీ పిలుపు వినని నేను ఎలా మనగలను
 
మనసుదోచే అందాలు నా చుట్టూ ఉన్నా..
అంతులేని ఆనందాలకు కొదవ లేకున్నా..
నీవు లేక అవన్నీ పెద్ద గుండు సున్నా

నీవు లేని నేను ...ఎలా గడప గలను..
నీ పిలుపు వినని నేను ఎలా మనగలను

ఎన్నిసార్లయినా నన్ను దండించు...
ఎంతసేపైనా నన్ను ఏడిపించు..
నిన్ను మరవలేను..నీ కోసమే ఈ పిలుపు...

నీ కోసమే ఈ పిలుపు...

నా రెండు కళ్ళ నిండా నీ రూపమే నిండింది...
నా తలపుల నిండా మన సహవాసమే సాగింది..

నీవు లేని నేను ...ఎలా గడప గలను..
నీ పిలుపు వినని నేను ఎలా మనగలను
 
ఏ చోటికి వెళ్ళినా..ఏ పనిమీద ఉన్నా...
ఎవరితో మాట్లాడుతున్నా..ఎటువైపు చూస్తూ ఉన్నా..
నీ కోసమే వెతుకుతుంది నా పిచ్చి హృదయం ..

నీ కోసమే వెతుకుతుంది నా పిచ్చి హృదయం ..

జీవమైతే ఉంది కానీ..జీవిద్దామనే ఆసక్తి లేదు..
జనజీవనంలో తిరుగుతున్నా...నాజీవమైన నీ జాడ లేదు..

నీవు లేని నేను ...ఎలా గడప గలను..
నీ పిలుపు వినని నేను ఎలా మనగలను

Wednesday, October 17, 2012

కొండరాతి బండ కంటే కఠినమా నీవు?

శ్వాస శ్వాస కూ నీ ఊసే ..మాట మాటకూ నీ తలపే ..ఘడియ ఘడియకూ నీ ఘనతే ..


చూపు చూపుకూ నీ చలోక్తులే .. ఎలా దూరావు నా మదిలో..ఎప్పుడు ఆక్రమించావు నా మనసును

నీవు లేక నీతో వెళ్ళిన నా మనసు లేక ఎలా బ్రతకాలి నేను .. శ్రుతి లేని పాటలా ...జాబిలి లేని ఆకాశంలా ..వాసనలేని పూవులా ...తీగలు తెగిన వీణలా ..జీవిస్తున్న నాపై జాలి కలుగదా నీకు ..

కొండరాతి బండ కంటే కఠినమా నీవు?

  

గడుపుతున్నాను ఎదురు చూస్తున్నాను నీ వస్తావన్న ఆశతో జీవిస్తున్నాను ...

నిద్ర రాని ఈ నిశీధి రాత్రిలో..మాటలు రాని నా మౌన వేదనతో.. కన్నీరు ఇంకిపోయి మూసుకు పోతున్న నా రెండు కళ్ళను ..నీకోసం నలిగిపోతున్న నా హృదయాన్ని

రంగరించి, రాగం చేసి, ఆవేదనను అర్ధం చేసుకొంటావనే ఆశతో.. నీ మనసుని తాకుతాయనే ఆర్తితో

గ్రంధస్తం చేస్తున్నా నా ఈ బరువైన భావాలను ..
సవ్వడి చేయని ఈ సంధ్య గాలిలో.. పిండారబోసినట్లున్న ఈ వెన్నెలలో..
వెలుగులను నింపే నీ ముఖ పద్మాన్ని..అదేపనిగా రెప్పలార్పకుండా చూడాలని ..

తపిస్తున్నాయి జపిస్తున్నాయి ఎదురు చూస్తున్నాయి నా కనుదోయి...

ఎందరున్నా నా అనే వారు కానరాని ఈ లోకంలో .... ఎన్ని సౌఖ్యలున్నా ఏదో వెలితిగా అనిపించే నా మనసుకు ....

ఆసరాగా నిలిచి ఓదార్చి నీవు నాకోసమే జన్మించావని తలపించే విధంగా..నా తల నిమిరే నీ చల్లని చేతుల స్పర్స కోసం విలపిస్తుంది నా దేహం ..

జలపాతపు సవ్వడిలా ..వీణా నాదం లా కోయిల కమ్మని రాగం లా తల్లి పడే జోల పాటలా పచ్చని చిలుకల కిల కిలా రావంలా

అనిపించి వినిపించి పరవశింప చేసే నీ మృదు మదుర దరహాసపు ప్రవాహాన్ని విని తరించాలని విల విల లాడుతున్నాయి నా చెవులు

నీ చెలిమితో గడిచే ఆ క్షణాల కోసం మనము చెట్టాపట్టాలేసుకొని విహరించే ఆ స్వర్గం కోసం నీ సరసన నేను పొందే ఆ ఆనంద అనుభూతి కోసం ..

నీవు నా పై కురిపించబోయే నీ ప్రేమామృత ధారల కోసం ఎంత ఎదురు చూస్తున్నానో ఎలా చెప్పాలి ...

క్షణ క్షణాన్ని లెక్క పెట్టుకుంటూ ..నిన్ను నా నుండి దూరం చేసిన కాలాన్ని నిందిస్తూ ..

మనము కలుసుకోబోయే ఆ చారిత్రాత్మక సంఘటన కోసం.. నీ రాక కోసం నీ పిలుపుకోసం నీ చెలిమికోసం నీ ప్రేమకోసం..
వేయి కన్నులతో వల్లంతా వత్తులతో ఈ జీవితం నీకోసమే అనే భావనతో ..
గడుపుతున్నాను ఎదురు చూస్తున్నాను నీ వస్తావన్న ఆశతో జీవిస్తున్నాను ...


వీటితో పోటీ పడలేని నేను తికమక పడుతున్నా నీకేమి ఇవ్వాలా అని ...

ఉవ్వెత్తున లేచే కెరటం ఎదురు చూస్తుంది నీ పాదాలు తాకాలని ..


మిల మిల లాడే నక్షత్రం తపన పడుతుంది నీకు కాంతి పంచాలని ..

వేగంగా కదిలే మేఘం నడుం వంచింది నిన్ను వీపుపై మోయాలని ..

వీటితో పోటీ పడలేని నేను తికమక పడుతున్నా నీకేమి ఇవ్వాలా అని ...

Tuesday, October 16, 2012

నీకు దూరమైన తరువాత తెలిసింది నేను పోగొట్టుకున్న నిధి విలువేమిటో...

నిన్ను కలిసిన క్షణాన తెలిసింది ఆనందం ఆకారమేమిటో..

నీవు పిలిచినా తరువాత తెలిసింది నా పేరెంత తీయనైనదో..

నీతో కలిసి నడిచిన పాదాలకు తెలిసింది స్వర్గములో విహారము ఎలా ఉంటుందో..
నీకు దూరమైన తరువాత తెలిసింది నేను పోగొట్టుకున్న నిధి విలువేమిటో...



విలపించే నా మనసు నీ లేఖ కోసం...

ఎగిరే ఆ పక్షులు నీ జాడ కోసం..


వికసించే ఆ పువ్వులు నీ నవ్వు కోసం..

గంతులేసే ఆ లేగ దూడలు నీ చేతి స్పర్శ కోసం..

విలపించే నా మనసు నీ లేఖ కోసం...