వెలుగులు చిమ్మే ప్రతి ఉదయం
గుర్తు చేస్తుంది మన స్నేహం
ఉరకలు వేస్తూ పరిగెట్టే సమయం
పదే పదే ప్రశ్నిస్తుంది నీ విషయం
చల్లగ వీచే మలయ మారుతం
నీ ఆచూకి కోసం పడుతుంది ఆరాటం
ప్రేమను పంచే సంధ్యా సమయం
నీ పలుకు లేక పడుతుంది కలవరం
నీ ఆలోచలనతో నిండిన నా హృదయం
నీ రాక కోసం తపిస్తుంది నిరంతరం