Saturday, March 8, 2014

ఆమె మహిళ మాత్రమే కాదు....ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న నాయిక...



సృష్టి చేసేది బ్రహ్మ అయితే 
ఆ సృష్టికి ఆధారము అమ్మ 

మనిషిని బ్రతికించేది ఆహారం అయితే 
దానిని షడ్రుచులతో వడ్డించేది ఇల్లాలు 

ప్రేమను ప్రేరేపించేది భగవంతుడు అయితే 
దానిని పెంచి పోషించేది మహిళ

సువాసనకు ఆధారం పూవులు అయితే 
ఆ సుగంధాన్ని జగమంతా వ్యాపింప చేసేది స్త్రీ మూర్తి 

బిడ్డల జన్మకు కారణం తండ్రి అయితే 
వారిని గొప్ప నాయకులుగా తీర్చి దిద్దేది తల్లి 

తల్లి దండ్రుల పోషణకు కొడుకు  ధనం ఇస్తే 
వారికి కొండంత అనురాగాన్ని ఇచ్చేది కూతురు 

డబ్బు సంపాదించి ఇచ్చేది భర్త అయితే 
నేర్పుతో ఓర్పుతో గృహాన్ని నిలబెట్టేది గృహిణి 

ఆమె అబల కాదు ఆది శక్తి 
వంటకు మాత్రమే పరిమితం కాదు వాగ్దేవి 
సౌందర్య రాశి మాత్రమే కాదు సంగీత సరస్వతి
ఇల్లాలు మాత్రమే కాదు ఇలవేల్పు 

ఆమె మహిళ మాత్రమే కాదు....ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న నాయిక...