మన మాత్రు భాష అయిన తెలుగును వ్యవహారికంలో మినహా ఎక్కడా వుపయోగించలేక పొతున్నాము. తెలుగు భాష పై నాకున్న గౌరవముతో నాకు వచ్చిన అలోచనలకు మరియు నచ్చిన కవితలు, పాటలు, ఏకపాత్రల రూపమే ఈ సంపుటి.
Monday, January 18, 2010
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
నాతో చెప్పకనే నా మనసులోనే చేరిపోయావే
నాతో చెప్పకనే నా మనసులోనే చేరిపోయావే
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
తీయనైన చూపుల్తో నాలోన సెగలే రగిలించావే
తీయనైన చూపుల్తో నాలోన సెగలే రగిలించావే
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
రాత్రంతా నీతలపే పగలంతా నీద్యాసే
మనసంతా ఆక్రమించి పిచ్చి బాగా ఎక్కించావే
ప్రేమనిండిన చూపుల్తో తనువంతా కుదిపేసావే
దారితప్పిన నన్ను చూసి జనమంతా నవ్వుతున్నారే
ఛెప్పవే పిల్లా....
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
తీయనైన చూపుల్తో నాలోన సెగలే రగిలించావే
తీయనైన చూపుల్తో నాలోన సెగలే రగిలించావే
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
మన ఇద్దరి కలయికే సొగసులొలికే విరిజల్లులే
భువిపైన స్వర్గమే మనము నడిచే బాటలే
దాచిపెట్టినా దాగవులే నీ కల్లలోని ప్రేమలే
మెరిసే మేఘమే నీ ముద్దులొలికే ముఖబింబమే
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
నాతో చెప్పకనే నా మనసులోనే చేరిపోయావే
నాతో చెప్పకనే నా మనసులోనే చేరిపోయావే
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
నీవు కరుణించి నన్ను చేరితే అది అంతులేని ఆనందమే
మదిలోని మమతనే ఈ మన్మదునితో వినిపించవే
నా గుండెలోన నీకే గుడి కట్టి గౌరవిస్తానే
దివ్యమైన నా దేవినే పూలతో పూజిస్తానే
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
నాతో చెప్పకనే నా మనసులోనే చేరిపోయావే
నాతో చెప్పకనే నా మనసులోనే చేరిపోయావే
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
తీయనైన చూపుల్తో నాలోన సెగలే రగిలించావే
తీయనైన చూపుల్తో నాలోన సెగలే రగిలించావే
ఛెప్పవే పిల్లా నీపేరేమిటో నీఊరేమిటో
Sunday, January 3, 2010
అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర
అనవరత ప్రజాపీడిత పరాన్నబుక్కులు అనంత రాజ్య కాంక్షా వ్యామోహ పీడితులు అయిన ఆంగ్లేయుల ఆంక్షలకూ ఆగడాలకు అంతు లేకుండా ఉంది.
శాశ్వత స్వాతంత్ర్య సముపార్జన ఘోరమైన నేరం కోరవద్దంటున్నారు.
అనన్య జాతీయ చైతన్య సముద్దీపన తప్పు ముప్పు తప్పుకోమంటున్నారు.
ఉత్తమ ప్రజానాయకులను ప్రభుత్వ విరోధ నిరోధ శక్తులుగా నిర్ణయించి పట్టి కొట్టి కారాగారముల నెట్టిస్తున్నారు.
నిరంతర నిర్మల దర్మ మూర్తులైన దేశభక్తులను దేశద్రోహులుగా ప్రకటించి ఉరికంబాలు ఎక్కిస్తున్నారు.
సమస్త భారతదేశ సౌభాగ్య విభవాన్ని తమదేశానికి తరిలించుకుపోయి మన దేశవాసులను దుర్గమ దారిద్ర్యములో జీవశ్చవాలై బ్రతుకమంటున్నారు.
రాజ్య కాంక్షతో రాజకీయపుటెత్తులతో రాజ్యాన్ని రణరంగము చేస్తున్నారు.
మన నెత్తురు మన నెత్తురుపైనే ఎదురు తిరిగేటట్లు చేస్తున్నారు.
మన కత్తులను మన కుత్తుకలలోనే దింపి మన ముందే మన మందిని కూలదోస్తున్నారు.
నందనవనంలాంటి సుందరదేశములో మందుగుండు సామానుతో మారణహోమం సాగిస్తున్నారు.
ఏమైనా ఇక ఈ నీచప్రభుత్వ నిరంకుశత్వ క్రూరత్వానికి భారతప్రజాశక్తి నిస్తేజమై నిద్రాణమై పోకూడదు.
భండనమున ఖండ ఖండాలలో అఖండ కీర్తి నార్జించిన భరతఖండ ప్రజలు నేడిటు పరరాజుల పాలనకు లొంగి క్రుంగి క్రుశించిపోకుడదు.ఈ బానిసత్వము శాశ్వతము కాకూడదు.
భారత యువతలో నిద్రాణమైన శక్తిని నిద్దుర లేపుతాను.
నిస్తేజమైన పౌరుషాన్ని తేజోమయము చేస్తాను.
వాళ్ళ నిండు గుండెల్ని విప్లవాగ్ని గుండాలుగా రగిలింప చేస్తాను.
ప్రజలను ప్రళయకాలరుద్రులుగా వీరబద్రులుగా తయారు చేస్తాను.
స్వాతంత్ర్య కాముక ప్రజావాహినీ ఉత్తుంగ తరంగ తురుంగ సంఘాతములకు ఆ ఆంగ్లేయుల శ్రుంగభంగమై ఒక్కసారి పారిపోవాలి. అదే నా లక్ష్యము. ఆదే నా జీవిత ద్యేయము.
నా ఈ లక్ష్య సాధనలో అత్మార్పనకు సైతము నేను సిద్దము.
అన్యాయము అత్యాచారాలతో అమానుషముగా రాజ్యమేలుతున్నారు.
రెక్కలు ముక్కలు చేసుకొనే శ్రామికులను చిత్రవధ చేస్తున్నారు.
ఆశ్రయమిచ్చినవారినే అదఃపాతాలానికి నెట్టారు ఆ ఆంగ్ల క్రుతఙ్ఞులు.
నీడ నిచ్చిన చెట్టునే సమూలాగ్రంగా నరికివేయాలనుకొనే నీచాతి నీచులు.
భారత దేశ సంపదను తమ దేశానికి దొంగిలించుకుపొయే బందిపోటుదొంగలు ఆ నీచాధములు.
ఈ పుణ్యభూమి స్వేచ్చా స్వాతంత్ర్యాలను అరికట్టి యావత్భారతదేశానికి
బానిసత్వ సంకెల్లు తగిలించిన పరమ కిరాతకులు.
నీతిని జాతిని విస్మరించి మన వారే వారి స్వార్దము కొరకు సోదరులను హింసిస్తున్నారు.
తమ కళ్ళ ముందే తమ అక్కా చెల్లెళ్ళ శీలాన్ని హరిస్తుంటే లజ్జావిహీనులై
అధికార దాహముతొ ఆంగ్ల కుక్కలకు తొత్తులై జీవిస్తున్నారు.
అభిమానము అమ్ముకొని ఆత్మగౌరవము చంపుకొని పదవీవ్యామోహ మధాంధులై జీవిస్తున్నారు.

Subscribe to:
Comments (Atom)