Thursday, December 24, 2009

నా జీవన జ్యోతివి నీవు



నా జీవన జ్యోతివి నీవు
నీ నవ్వులే నవపరిమళం నాకు


నా ప్రణయపు ప్రమోదం నీవు
నీ సవ్వడే సంగీతం నాకు


పగలసెగలతో రగిలే నన్ను నీ ప్రేమతో ప్రేరేపించావు
సోమరితనముతో తిరిగే నన్ను నీ సేవతో సంస్కరించావు
ఒంటరితనముతో బ్రతికే నాకు నీ ఆలనతో ఆనందమిచ్చావు
నిస్సత్తువతో నలిగే నాకు నీ మమతతో మార్గంచూపావు


నా జీవన జ్యోతివి నీవు
నీ నవ్వులే నవపరిమళం నాకు


ఆప్యాయతతో కలిపి ఆహారాన్ని అమ్రుతంగా అందిస్తావు
భవోద్వెగంతో నింపి భొదనలను భవ్యరూపంగా భొధిస్తావు
ప్రణయరాగంతో పిలిచి ప్రేమజ్యోతిని ప్రభలంగా ప్రజ్వలింపచేస్తావు
స్వర్గతుల్యంతొ సేవించి స్నెహభావాన్ని సలలితంగా సమర్పిస్తావు


నా జీవన జ్యోతివి నీవు
నీ నవ్వులే నవపరిమళం నాకు


మన అనురాగమే ఆలయమై ఆ ఆలయాన దేవత నీవు కావాలి
మన పరిచయమే పరమపదమై పదిలమైన మమత నీవు కావాలి
మన సహజీవనమే సంగీతమై సుస్వరాల సమత నీవు కావాలి
మన పరిణయమే పారిజాతమై సువాసనల జనిత నీవు కావాలి


నా జీవన జ్యోతివి నీవు
నీ నవ్వులే నవపరిమళం నాకు


నా ప్రణయపు ప్రమోదం నీవు
నీ సవ్వడే సంగీతం నాకు




                       ------ప్రభాకర రావు కోటపాటి